IPL మ్యాచ్ ల పాసుల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. IPL టికెట్లు, పాసుల కోసం HCA(హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్) వేధిస్తోందని SRH ఆరోపించింది. టికెట్లు, పాస్ ల విషయంలో HCAపై కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆరా తీసిన CM.. విజిలెన్స్ విచారణకు ఆదేశాలిచ్చారు. విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ DG కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు.