రెజ్లర్లను లైంగిక వేధించారనే కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. మైనర్ సహా ఏడుగురు రెజ్లర్లను వేధించారంటూ నమోదైన కేసులో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. ఎంక్వయిరీ కోసం ఈ నెల 18న కోర్టుకు అటెండ్ కావాలని, నిందితుడిపై విచారణ జరిపేందుకు ఈ కేసులో ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. బ్రిజ్ భూషణ్ తోపాటు WFI అసోసియేట్ సెక్రెటరీ వినోద్ తోమర్ కు కూడా నోటీసులు పంపింది.
బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలంటూ ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా పలువురు క్రీడాకారులు ఆందోళన బాట పట్టారు. రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో లైంగిక వేధింపులు, ఇతర అభియోగాల కింద దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.