రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. వరుసగా ఆరో విజయం(Sixth Win)తో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను మట్టి కరిపించి ‘ప్లేఆఫ్స్’లోకి ప్రవేశించింది. అంతకుముందు కంటిన్యూగా ఆరు ఓటములు మూటగట్టుకుని ‘ప్లేఆఫ్స్’ సందిగ్ధం(Doubt)గా మార్చుకున్న RCB.. అదే రీతిలో వరుసగా ఆరు విజయాలతో తుది-4లో చోటు దక్కించుకుంది.
మరోసారి ఓపెనర్లు…
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు మరోసారి ఓపెనర్లు మంచి పార్ట్నర్ షిప్ ఇచ్చారు. కోహ్లి(47; 29 బంతుల్లో 3×4, 4×6), డుప్లెసిస్(54; 39 బంతుల్లో 3×4, 3×6), పటీదార్(41; 23 బంతుల్లో 2×4, 4×6), గ్రీన్(38; 17 బంతుల్లో 3×4, 3×6) ఇలా టాప్-4 బ్యాటర్లు బాగా ఆడటంతో 5 వికెట్లకు 218 స్కోరు చేసింది. చివర్లో దినేశ్ కార్తీక్(14), మ్యాక్స్ వెల్(16) ధాటిగా ఆడారు.
బ్యాటర్ల వైఫల్యంతో…
బ్యాటర్ల వైఫల్యం(Failure)తో చెన్నై ముందుకు సాగలేకపోయింది. గైక్వాడ్(0) ఔటైనా రచిన్ రవీంద్ర(61; 37 బంతుల్లో 5×4, 3×6), రహానే(33; 22 బంతుల్లో 3×4, 1×6), జడేజా(42; 22 బంతుల్లో 3×4, 3×6), ధోని(25; 13 బంతుల్లో 3×4, 1×6), అంతోఇంతో ఆడినా మిచెల్(4), దూబె(7) నిలబడలేదు. దీంతో ఓవర్లు ముగిసేసరికి ఆ టీమ్ 191/7తో నిలిచి 27 రన్స్ తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, లఖ్నవూ 14 పాయింట్లతో సమంగా ఉన్నా మెరుగైన రన్ రేట్ తో బెంగళూరు పై దశకు చేరుకుంది.