అసలే డిఫెండింగ్ ఛాంపియన్.. ఈసారీ కప్పు రేసులో టాప్ పొజిషన్లో ఉందన్న ప్రశంసలు.. బజ్ బాల్ ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే శైలి.. ఇదీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్(England) పై ఉన్న ఆశలు. కానీ అధ్వాన ఆటతీరుతో అనఫిషియల్ గా.. అఫ్గాన్, నెదర్లాండ్స్, శ్రీలంక కన్నా ముందుగానే ఇంటిదారి పట్టింది. కానీ ఇప్పుడు అఫిషియల్ గానే ఇంటికి వెళ్లిపోతున్నది. అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలై వెనుదిరుగుతోంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కంగారూలు 49.3 ఓవర్లలో 286 రన్స్ కు ఆలౌటయ్యారు. 287 టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లిష్ టీమ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకు చేతులెత్తేసి 33 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
ఆసీస్ జట్టులో లబుషేన్(71), గ్రీన్(47), స్మిత్(44), స్టాయినిస్(35) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు తీసుకున్నాడు. అటు ఇంగ్లండ్ టీమ్ లో స్టోక్స్(64), మలన్(50), మొయిన్(42) తలో చేయి వేశారు. 247 రన్స్ కే 8 వికెట్లు కోల్పోయిన జట్టును ఆడమ్ జంపా(29) ఆదుకుని ఆసీస్ స్కోరు మరింత పెరగడానికి, ఇంగ్లండ్ ఆ మాత్రం తేడాతో ఓడిపోవడానికి కారణంగా నిలిచాడు. 3 వికెట్లు 29 పరుగులు చేసిన జంపాకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.