ఏడుకే మూడు వికెట్లు… 65కు చేరేసరికి ఐదుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ లో… 210 పరుగుల టార్గెట్ ఛేదించాలన్న ధ్యాసే కనపడలేదు ఢిల్లీకి. ఫ్రేజర్(1), పోరెల్(0), రిజ్వీ(4) టపాటపా వికెట్లు పారేసుకున్నారు. డుప్లెసిస్(29), అక్షర్(22), స్టబ్స్(34) కొద్దిసేపే నిలబడ్డారు. పనైపోయిందన్న టైంలో విప్రజ్ నిగమ్(39; 15 బంతుల్లో 5×4, 2×6), అశుతోష్ శర్మ మలుపు తిప్పారు. విప్రజ్ వెనుదిరిగినా అశుతోష్(66 నాటౌట్; 31 బంతుల్లో 5×4, 5×6) పోరాటం ఆగలేదు. లఖ్‌నవూపై అతడు 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో వికెట్ గా కుల్దీప్(5) ఔటైనా విజయం అందించి హీరోగా నిలిచాడు. 19.3 ఓవర్లలో 211/9 చేసి ఒక వికెట్ తేడాతో క్యాపిటల్స్ గెలుపొందింది.