ముందుగా బ్యాటింగ్ తో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్(DC) ఆ తర్వాత ప్రత్యర్థిని ముందునుంచీ కట్టడి(Restrict) చేసింది. అయితే మిడిలార్డర్ పోరాటం చేసినా భారీ స్కోరును అందుకోలేక చతికిలపడ్డ ముంబయిపై.. మొన్నటి మ్యాచ్ కు ఢిల్లీ ప్రతీకారం(Revenge) తీర్చుకుంది. తొలుత DC 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. రసిఖ్ సలాం దార్ 3 వికెట్లు తీయడంతో 247/9కి పరిమితమై 10 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.
ముందుగా…
ఢిల్లీ సునామీలా విరుచుకుపడింది. ఫ్రేజర్ మెక్ గర్క్(84; 27 బంతుల్లో 11×4, 6×6), అభిషేక్ పోరెల్(36; 27 బంతుల్లో 3×4, 1×6), షాయ్ హోప్(41; 17 బంతుల్లో 5×6) ట్రిస్టన్ స్టబ్స్(47 నాటౌట్; 24 బంతుల్లో 6×4, 2×6), పంత్(29; 19 బంతుల్లో 2×4, 2×6), అక్షర్(11) బౌలర్లను చితకబాది పరుగులు పిండుకున్నారు.
మొదట్లోనే…
భారీ టార్గెట్ తో రంగంలోకి దిగిన హార్దిక్ సేన 65కే 3 ప్రధాన వికెట్లను కోల్పోయింది. రోహిత్(8), ఇషాన్(20), సూర్య(26) తొందరగానే వెనుదిరిగారు. కానీ తిలక్ వర్మ, పాండ్య జోడీ పోరాటం చేసింది. చివరకు హార్దిక్(46; 24 బంతుల్లో 4×4, 2×6)తోపాటు తిలక్ హాఫ్ సెంచరీ మురిపించింది. హార్దిక్, ఆ తర్వాత వధేరా(4) ఔటవడంతో ఇక భారమంతా తిలక్(62; 31 బంతుల్లో 4×4, 4×6), టిమ్ డేవిడ్(37; 16 బంతుల్లో 2×4, 3×6) పై పడింది. అప్పటికే రన్ రేట్ పెరిగిపోవడం, డేవిడ్, నబీ(7), తిలక్ ఔటవడంతో ముంబయి కథ ముగిసింది.