ప్రమాదం నుంచి బయటపడి మళ్లీ బ్యాట్ పట్టిన రిషభ్ పంత్.. తన మునుపటి దూకుడును చూపించాడు. ప్రారంభంలో నిదానం(Slow)గా ఆడినా చివర్లో బ్యాట్ కు పనిచెప్పాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్(DC)… 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. తొలి ముగ్గురు బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు మంచి స్కోరే చేసింది.
వార్నర్, పంత్ జోడీ…
ఓపెనర్లు పృథ్వీషా(43; 27 బంతుల్లో 4×4, 2×6), డేవిడ్ వార్నర్(52; 35 బంతుల్లో 5×4, 3×6) జోరు చూపించారు. 93 స్కోరు వద్ద ఫస్ట్ వికెట్ గా వార్నర్ ను ముస్తాఫిజుర్, 103 వద్ద రెండో వికెట్ గా పృథ్వీని జడేజా ఔట్ చేశారు. తర్వాత పంత్(51; 32 బంతుల్లో 4×4, 3×6) సైతం ధాటిగా ఆడాడు. మిచెల్ మార్ష్(18), ట్రిస్టల్ స్టబ్స్(0)ను వరుస బాల్స్ లో పతిరణ బౌల్డ్ చేసిన తీరు హైలెట్ గా నిలిచింది. చివర్లో అక్షర్ పటేల్(7 నాటౌట్), అభిషేక్ పోరెల్(9 నాటౌట్) మిగిలారు. మతీషా పతిరణ మొత్తం మూడు వికెట్లు తీసుకున్నాడు.
సీఎస్కే ఆదిలోనే…
భారీ టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్(CSK).. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) వికెట్లను కోల్పోయింది. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా.. మొదట్నుంచీ బాదుడుకు దిగే రచిన్ 12 బంతులాడి 2 రన్సే చేసి వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లను ఖలీల్ అహ్మద్ తీసుకోగా.. అతడు మూడు ఓవర్ల స్పెల్ లో కేవలం 9 పరుగులే ఇచ్చాడు.