మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఓటముల నుంచి గుజరాత్ జెయింట్స్(GG) బయటపడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లకు 127 పరుగులే చేసింది. భారతి ఫల్మలి(40), దియాండ్ర(26)లే హయ్యెస్ట్ స్కోరర్లు. మూనీ(10), హర్లీన్(5), లిచ్ ఫీల్డ్(0), గార్డ్నర్(3), కశ్వీ(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. తర్వాత ఢిల్లీ బ్యాటర్లు జొనాసన్(61 నాటౌట్), షెఫాలి(44).. ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. 15.1 ఓవర్లలోనే ఢిల్లీ 131/4 చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 మ్యాచుల్లో గుజరాత్ కు ఇది మూడో ఓటమి కాగా.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.