యువ వికెట్ కీపర్ ధ్రువ్(Dhruv) జురెల్.. 20 ఏళ్ల క్రితం మహేంద్రసింగ్ ధోని నెలకొల్పిన రికార్డును సమం(Equaled) చేశాడు. 7 క్యాచ్ లు తీసుకుని ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. బెంగళూరులో ముగిసిన దులీప్ ట్రోఫీలో ఇండియా ‘బి’ తరఫున బరిలోకి దిగిన అతడు బ్యాటింగ్ లో(రెండు ఇన్నింగ్స్ ల్లో 2, 0) ఫెయిలైనా వికెట్ల వెనుక బాగా రాణించాడు.
ఇండియా ‘బి’ విధించిన 275 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా ‘ఎ’ 198కే ఆలౌటైంది. బంగ్లాతో టెస్టుకు ఎంపికైన యశ్ దయాల్ 3/50 రాణిస్తే, ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 2004-05 సీజన్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన ధోని.. సెంట్రల్ జోన్ బ్యాటింగ్ లో 7 క్యాచ్ లు తీసుకున్నాడు. ఇప్పుడా రికార్డును జురెల్ సమం చేశాడు. జురెల్ సైతం బంగ్లాతో టెస్టుకు సెలెక్ట్ అయ్యాడు.