మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్(First Innings)లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుమ్రా 5 వికెట్లు తీయడం రెండ్రోజుల ఆటలో హైలెట్. ఈ ఐదుగురిలో నలుగురు బౌల్డయ్యారు. రూట్(104), బ్రూక్(11), స్టోక్స్(44), ఆర్చర్(4), వోక్స్(0)ను వెనక్కు పంపాడు. నితీశ్ 2, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీసుకోవడంతో ఇంగ్లండ్ 387కు ఆలౌటైంది. బ్రైడన్ కార్స్(56) చివరి వరకు పోరాడాడు.