రెండో టెస్టులో గెలిచి జోరు మీదున్న భారత జట్టు.. మూడో టెస్టులోనూ పట్టు బిగించింది. 4 వికెట్లు తీసుకుని మలుపు తిప్పాడు వాషింగ్టన్ సుందర్. అతడికి మిగతా బౌలర్లు తోడు నిలవడంతో ఇంగ్లండ్ తక్కువకే ఆలౌటైంది. క్రాలీ(22), డకెట్(12), పోప్(4), రూట్(40), బ్రూక్(23), స్టోక్స్(33), స్మిత్(8), వోక్స్(10) వెనుదిరిగారు. రూట్, స్టోక్స్ జోడీ క్రీజులో ఉండి 154/5తో పటిష్ఠంగా కనిపించిన ప్రత్యర్థిని.. సుందర్ దెబ్బతీశాడు. ఔట్ చేసిన బ్యాటర్లందరినీ బౌల్డ్ చేశాడు. బుమ్రా, సిరాజ్ రెండేసి.. నితీశ్, ఆకాశ్ తలో వికెట్ చొప్పున తీసుకున్నారు. 193 పరుగులు చేస్తే విజయం టీమ్ఇండియా సొంతమవుతుంది.