సొంతగడ్డపై ఇప్పటికే రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్(England).. మూడో వన్డేలో రెచ్చిపోయింది. దక్షిణాఫ్రికాపై తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్లకు 414 స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్లు జో రూట్(100), జాకబ్ బెథెల్(110) సెంచరీలు చేశారు. జేమీ స్మిత్(62), జోస్ బట్లర్(62 నాటౌట్) అండతో భారీ స్కోరు నమోదైంది. కార్బిన్ బాష్(Bosch), కేశవ్ మహరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.