తొలుత ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టునే ఓడించి 2-1తో సిరీస్.. అదే ఊపుతో ఇంగ్లండ్ లో అడుగుపెట్టి వరుసగా రెండు గెలిచి కప్పు దక్కించుకుంది. కానీ చివరి వన్డేలో దక్షిణాఫ్రికా దారుణంగా కుప్పకూలింది . తొలుత ఇంగ్లండ్ 414/5 చేస్తే, సౌతాఫ్రికా 72కే చేతులెత్తేసింది. అటు రూట్(100), బెథెల్(110) సెంచరీలు చేస్తే.. ఈ టీంలో బాష్(20)దే టాప్ స్కోర్. మార్ క్రమ్(0), రికెల్టన్(1), మల్డర్(0), బ్రీట్జ్ కె(4), స్టబ్స్(10), బ్రూయిస్(6), మహరాజ్(17) చేశారు. 342 పరుగులతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 2023లో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలిచిన భారత్ రికార్డును ఇంగ్లండ్ బ్రేక్ చేసింది.