ఇంగ్లండ్ తో తొలి టీ20లో భారత బౌలర్లు విజృంభించి ప్రత్యర్థిని కోలుకోకుండా చేశారు. తొలుత అర్షదీప్, ఆ తర్వాత వరుణ్ మాయ చేశారు. మ్యాచ్ ఫస్ట్ ఓవర్ మూడో బంతికే ఫిల్ సాల్ట్(0)ను, ఆ కొద్దిసేపటికే మరో ఓపెనర్ బెన్ డకెట్(4)ను అర్షదీప్ ఔట్ చేశాడు. కానీ క్రీజులో ఉన్న కెప్టెన్ జోస్ బట్లర్(68) దూకుడు పెంచి ఆడాడు. అయితే స్పిన్నర్ వరుణ్ వరుస బాల్స్ లో బ్రూక్(17), లివింగ్ స్టోన్(0) ను ఔట్ చేయడంతో 65 స్కోరుకే నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ ఇద్దరూ పొదుపుగా బౌలింగ్ చేస్తే పాండ్య ఎక్కువ పరుగులిచ్చాడు. బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే జాకబ్ బెథెల్(7), ఓవర్టన్(2), అట్కిన్సన్(2)తో పాటు అతడూ పెవిలియన్ చేరడంతో ఆ జట్టు 132కే ఆలౌటైంది. వరుణ్ 3, అర్షదీప్, అక్షర్, పాండ్య రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు. హైదరాబాద్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చురుకైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. బౌండరీ వద్ద పరుగుల్ని ఆపడంతోపాటు ముందుకు దూకుతూ బట్లర్ క్యాచ్ తీసుకున్న తీరు హైలెట్ గా నిలిచింది.