నాలుగో టెస్టులో వర్షం దెబ్బతో గెలుపును అందుకోలేకపోయిన ఇంగ్లండ్… చివరి టెస్టులో పట్టు బిగించింది. సిరీస్ నెగ్గాల్సిన మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. 12 రన్స్ లోటుతో శనివారం రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్.. 389/9తో థర్డ్ డే ఆట ముగించింది. దీంతో ఆ జట్టుకు 377 రన్స్ లీడ్ దక్కింది. జో రూట్(91; 106 బంతుల్లో 11X4, 1×6), బెయిర్ స్టో(78; 103 బంతుల్లో 11X4), క్రాలీ(73; 76 బంతుల్లో 9X4) రాణించడంతో స్టోక్స్ సేన మంచి స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్(4/94), మర్ఫీ(4/110) వికెట్లు తీసుకున్నారు.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంగారూ జట్టుకు 12 రన్స్ లీడ్ మాత్రమే దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ లో 295 రన్స్ చేసింది.