నాలుగో టీ20లో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ మొదలైందో లేదో అప్పుడే రెండో ఓవర్లో టపటపా మూడు వికెట్లు పడ్డాయి. ఇంగ్లండ్ పేస్ బౌలర్ సఖీబ్ మహమూద్ తన తొలి ఓవర్లో మాయ చేశాడు. తొలి బంతికి శాంసన్(1), రెండో బాల్ కు తిలక్ వర్మ(0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ దిశగా సాగాడు. కానీ క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్.. తర్వాతి మూడు బంతుల్లో ఒక్క పరుగూ చేయలేదు. కానీ ఆరో బాల్ కు సూర్య(0) క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు. తొలి ఓవర్లో 12/0గా ఉన్న స్కోరు బోర్డు రెండు ఓవర్లు ముగిసే సరికి 12/3కు చేరుకుంది. మహమూద్ దెబ్బతో టీమ్ఇండియా ఇబ్బందులు పడింది.