వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపుమీద కనిపించిన భారత్.. నిర్ణయాత్మక మూడో టీ20లో చేతులెత్తేసింది. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగి మిడిలార్డర్ నిలబడలేకపోవడంతో పరాజయం పాలైంది. రాజ్ కోట్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ను కట్టడి చేశామని సంబరపడ్డా.. ఆ స్కోరును కూడా అందుకోలేక ఓటమి మూటగట్టుకుంది. తొలుత ఇంగ్లిష్ టీమ్ 9 వికెట్లకు 171 పరుగులు చేస్తే.. ఓవర్లు ముగిసే సరికి భారత్ 9 వికెట్లకు 146 రన్స్ చేసి 26 పరుగుల తేడాతో ఓటమి చెందింది. హార్దిక్ పాండ్య(40) మినహా ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేదు. శాంసన్(5), అభిషేక్(24), సూర్య(14), తిలక్(18), సుందర్(6), అక్షర్(15), జురెల్(2) చేతులెత్తేశారు. ఈ ఓటమితో 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1తో ఉంది.