PHOTO: THE TIMES OF INDIA
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ తొలి బంగారు పతకం(Gold Medal) సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ ను అందుకుంది. ఈ ఆసియా గేమ్స్ లో ఇదే మనకు తొలి మెడల్ కావడం విశేషం. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ టీమ్… 1893.7 పాయింట్లను నమోదు చేసి తొలి ప్లేస్ లో నిలిచింది. 1893.3 పాయింట్లతో చైనా పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బృందంగా గోల్డ్ మెడల్ సాధించిన రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ లు వ్యక్తిగతం(Individual)గా ఫైనల్ కు చేరుకున్నారు.
రోయింగ్ లోనూ మరో మెడల్
ఎయిర్ రైఫిల్ టీమ్ గోల్డ్ మెడల్ దక్కించుకుంటే రోయింగ్ విభాగంలోనూ భారత్ కు కాంస్య(Bronze) పతకం దక్కింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ ఈవెంట్ లో మూడో స్థానంతో కాంస్య పతకం సొంతమైంది. దీంతో రోయింగ్ విభాగంలో ఇప్పటివరకు నాలుగు మెడల్స్ అందుకున్నట్లయింది.