ఇంగ్లండ్ తో నాలుగో టెస్టుకు భారత జట్టు సరికొత్త నిర్ణయం తీసుకుంది. తుది-11లో ఐదుగురు ఎడమచేతి(Left Handers) ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కీపర్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండర్లు. ఇక కొత్త కుర్రాడైన పేసర్ అన్షుల్ కాంబోజ్(Anshul Kamboj) సైతం ఎంట్రీ ఇచ్చాడు. మాంచెస్టర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ తీసుకుంది.