2025 IPLల్లో LSGకి ఆడి 13 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్(Spinner) దిగ్వేశ్ రాఠీ(Rathi).. స్థానిక టీ20లో వరుసగా ఐదు బంతుల్లో 5 వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్ లో మొత్తంగా ఏడు వికెట్లు దక్కించుకున్నాడు. ఆ వీడియోని LSG యజమాని సంజీవ్ గోయెంకా ‘X’లో ట్వీట్ చేశారు. అత్యంత అరుదైన ఫీట్ అంటూ అతడికి 5 స్టార్స్ కేటాయించారు. అది ఏ లీగ్ అనేది ప్రకటించలేదు. బ్యాటర్ ఔటైన వెంటనే చేతితోనే ‘నోట్ బుక్ సెలబ్రేషన్స్’ చేసుకుంటూ IPLలో వివాదాస్పదుడిగా మారాడు దిగ్వేశ్.