భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతున్న కటక్ బారాబతి స్టేడియంలో ఫ్లడ్ లైట్లు పనిచేయలేదు. ఫ్లడ్ లైట్ టవర్లలో సమస్య తలెత్తి లైటింగ్ లేక మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో గ్రౌండ్ లో ఉన్న ప్రేక్షకులు సెల్ ఫోన్లల్లో లైట్ ఆన్ చేశారు. ఆ సమయంలో ఓపెనర్లు రోహిత్, గిల్ క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ 6.1 ఓవర్ వద్ద టీమ్ఇండియా 48 స్కోరు వద్ద ఉండగా అంతరాయం ఏర్పడింది. రోహిత్(29 నాటౌట్; 18 బంతుల్లో 1×4, 3×6), గిల్(17 నాటౌట్).. బ్యాటింగ్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను కొద్దిసేపు నిలిపివేశారు.