టీ20 వరల్డ్ ఛాంపియన్(Champion)గా అఫ్గానిస్థాన్ అయ్యే రోజు చూడబోతున్నామని ఆ జట్టుకు కోచింగ్ ఇచ్చిన భారత మాజీ ప్లేయర్ లాల్ చంద్ రాజ్ పుత్(Lalchand Rajput) విశ్వాసం వ్యక్తం చేశాడు. రేపు పొద్దున ఫస్ట్ సెమీఫైనల్ జరిగే గ్రౌండ్ నెమ్మదిగా ఉంటుందని, దీనివల్ల దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవన్నాడు.
అభిప్రాయమిలా…
‘మనం కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాం.. అది అఫ్గానిస్థానే అవ్వొచ్చు.. సెమీస్ పిచ్ స్లోగా ఉండటం సౌతాఫ్రికాకు నష్టమే.. అత్యద్భుత స్పిన్ అటాకింగ్ అఫ్గాన్ ఆధిపత్యానికి కారణమవుతుంది.. పెద్ద జట్ల చేతిలో అఫ్గాన్ ఓడుతుందని ఈ టోర్నీకి ముందు అనుకున్నా.. వన్డే వరల్డ్ కప్(2023) చూసి అలా భావించా.. కానీ ఇప్పుడు బ్రిలియంట్ గా ఆడుతున్నారు.. వాళ్ల బాడీలాంగ్వేజ్ చూస్తేనే తెలుస్తుంది ఏదో ఒకటి చేయాలన్న కసితో ఉన్నారని… నెమ్మదించే వెస్టిండీస్ పిచ్ లపై ప్రస్తుత బౌలింగ్ చాలు ఛాంపియన్ గా నిలవడానికి..’ అని ప్రశంసించాడు.
ప్రస్తుతమతడు…
2017 నుంచి 2018 వరకు అఫ్గాన్ కోచ్ గా ఉన్న లాల్ చంద్.. గతంలో భారత్, జింబాబ్వే జట్లకు సైతం పనిచేసి ప్రస్తుతం UAE కోచ్ గా ఉన్నాడు. 62 ఏళ్ల ఈ ముంబయి క్రికెటర్ కోచ్ గా ఉన్న సమయంలోనే 2007లో టీ20 అరంగేట్ర కప్పు(Inaugural Edition)ను ధోని టీమ్ గెలుచుకుంది.