యాషెస్ సిరిస్ లో భాగంగా నాలుగో టెస్టు ఈ రోజు ప్రారంభమవుతుంది. 5 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే 2-1తో ఆస్ట్రేలియా లీడ్ లో ఉంది. ఈ టెస్టులో గెలిస్తే ఆసీస్ సిరీస్ ను కైవసం చేసుకోనుండగా, ఇంగ్లాండ్ గెలిస్తే టైటిల్ రేసులో ముందుకొస్తుంది. తొలి రెండు టెస్టుల్లో ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన కంగారూలను మూడో టెస్టులో ఇంగ్లాండ్ సమర్థంగా అడ్డుకుంది. రెండు టెస్టుల్లో విఫలమైన బ్యాటర్లు తర్వాతి టెస్టులో పట్టుదల ప్రదర్శించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టి సిరీస్ లో పోటీకి నిలిపారు. ఇరు జట్లలోనూ ఇద్దరు సీమర్లు తిరిగి జట్టుతో కలవనున్నారు. అండర్సన్ ఇంగ్లాండ్ జట్టులోకి తిరిగి వస్తుండగా, గాయం నుంచి కోలుకున్న హేజిల్ వుడ్ ను ఆసీస్ ఆడించనుంది.
మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో ఆసీస్-ఇంగ్లాండ్ మరోసారి హోరాహోరీగా తలపడనున్నాయి.