కెప్టెన్ శుభ్ మన్ గిల్(84; 50 బంతుల్లో 5×4, 4×6), జోస్ బట్లర్(50; 26 బంతుల్లో 3×4, 4×6) ధనాధన్ బ్యాటింగ్ తో గుజరాత్ భారీ స్కోరు చేసింది. అంతకుముందు సాయి సుదర్శన్(39) సైతం నిలబడ్డాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్(RR)పై గుజరాత్ టైటాన్స్(GT) 4 వికెట్లకు 209 స్కోరు చేసింది. మేటి బౌలరైన జోఫ్రా ఆర్చర్.. 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు.