శుభ్ మన్ గిల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ హాఫ్ సెంచరీల(Fifty)తో ఆదుకోవడంతో న్యూజిలాండ్ తో మూడో టెస్టులో భారత్ గౌరవప్రదమైన స్కోరు దిశగా సాగుతున్నది. 84కే 4 వికెట్లు కోల్పోయిన టీమ్ ను ఈ ఇద్దరూ ముందుండి నడిపిస్తున్నారు. వన్డే తరహా బ్యాటింగ్ తో ఓవర్ కు 6 రన్ రేట్ పైగా పరుగులు తీశారు. దీంతో టీమ్ఇండియా 10 ఓవర్లలో 65 రన్స్ రాబట్టింది.
45 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గిల్.. క్రమంగా ఫిఫ్టీ పూర్తి చేశారు. అటు గిల్ కు భిన్నంగా పంత్ ధాటి(Speed)గా ఆడాడు. అతడు కేవలం 36 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్ లతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.