భారత యువ కెప్టెన్ శుభ్ మన్(Shubhman) గిల్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ(269) చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ(100 బ్యాటింగ్; 129 బంతుల్లో 9×4, 3×6)తో రెచ్చిపోయాడు. గిల్, పంత్(65; 58 బంతుల్లో 8×4. 3×6) జోడీ వన్డే తరహా ఆటతీరుతో ఇంగ్లిష్ బౌలర్లను ఆటాడుకుంది. పంత్ ఔటైనా కెప్టెన్ ఆటతీరు మారలేదు. ఈ టెస్టులో అతడొక్కడే 369 పరుగులు చేసి ఇంకా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. టీ సమయానికి 304/4తో ఉన్న టీమ్ఇండియా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి 484 పరుగులతో ఉంది.