నాలుగో టెస్టులో ఓటమి అంచు నుంచి బయటపడిన ఆస్ట్రేలియా చివరి టెస్టులో శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ ను 283 రన్స్ కు ఆలౌట్ చేసిన ఆసీస్ ఫస్ట్ డే ఆట క్లోజ్ అయ్యే సమయానికి 61/1తో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ టీమ్ లో టాప్ ఆర్డర్ అంతా ఫెయిలయింది. హ్యారీ బ్రూక్(85; 91 బంతుల్లో 11×4, 1×6) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటవడంతో ఆ జట్టు తేరుకోలేకపోయింది. మిచెల్ స్టార్క్(4/82) ప్రత్యర్థిని హడలెత్తించగా.. మర్ఫీ(2/22), హేజిల్ వుడ్(2/54) సహకరించారు.
తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఓపెనర్ వార్నర్(24) వికెట్ కోల్పోయింది. ఖవాజా(26), లబుషేన్(2) క్రీజులో ఉన్నారు.