చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్(World Champion) అయిన ఘనతను భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ అందుకున్నాడు. 2024 ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంటులో 17 సంవత్సరాల ఈ చిన్నోడు ఘన విజయం సాధించాడు. ప్రత్యర్థి అయిన అమెరికాకు చెందిన హికారు నకమురపై గెలుపొంది ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.
అతి చిన్న వయసులో(Youngest Player) ఫిడే క్యాండిడేట్స్ అందుకున్న వ్యక్తిగా, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండో భారతీయుడిగా తమిళనాడుకు చెందిన గుకేశ్ నిలిచాడు. గతేడాది ఆసియా గేమ్స్ లోనూ ఇతడు రజత పతకం(Silver Medal) అందుకున్నాడు. 9/14 పాయింట్లు సాధించి టోర్నీలో ఫస్ట్ ప్లేస్ ఆక్రమించాడు.
ఈ విజయం ద్వారా గుకేశ్ 88,500 యూరోలు(రూ.78.5 లక్షల)ను అందుకున్నాడు. ఈ టోర్నమెంటు మొత్తానికి 5 లక్షల యూరోలు ఖర్చు చేశారు. ఫిడే టోర్నీని గెలుచుకున్న ఈ చిన్నోడిని ప్రశంసిస్తూ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చేశాడు. మరో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.