చేసింది మోస్తరు స్కోరే(Average Score) అయినా దాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థిని మరింత తక్కువకే ఔట్ చేసి గుజరాత్ విజయం సాధించింది. ముంబయితో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గిల్ సేన 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హార్దిక్ సేన.. గుజరాత్ బౌలర్లు సమష్టి(Unity)గా రాణించడంతో 9 వికెట్లకు 162 స్కోరు వద్దే ఆగిపోయింది. దీంతో ఆ జట్టు 6 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ పై గెలుపును సొంతం చేసుకుంది.
తొలుత ఇలా…
గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(19) త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్(31) సాయి సుదర్శన్(45)తో జట్టును నడిపించాడు. కానీ ఈ ఇద్దరి తర్వాత క్రీజులో నిలిచేవారే లేక ఆ టీమ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్(17), డేవిడ్ మిల్లర్(12), రాహుల్ తెవాతియా(22) పెద్దగా రాణించలేకపోయారు. బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు.
అయినా వారిదే…
భారీ స్కోరు కాకున్నా ముంబయి ఓటమిని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్(0) డకౌట్ కాగా, రోహిత్ శర్మ(43), నమన్ ధిర్(20), డెవాల్డ్ బ్రెవిస్(46), తిలక్ వర్మ(25) అంతో ఇంతో ఆడినా.. టిమ్ డేవిడ్(11), గెరాల్డ్ కోయెట్జి(1) చివర్లో బ్యాట్ కు పనిచెప్పలేకపోయారు.