వన్డే ఫార్మాట్ లో ఇప్పటిదాకా పెద్దగా రాణించకున్నా ఆ క్రికెటర్ మాత్రం రోహిత్, కోహ్లి కన్నా మిన్నగా ఆడతాడని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. అలాంటి సత్తా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ను ‘వరల్డ్ కప్’ కు సెలెక్ట్ చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించాడు. రోహిత్, కోహ్లి సాధించలేనిది సూర్య చేస్తాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.. ఆ ఇద్దరితో కానిది ‘స్కై’తో మాత్రమే అవుతుందని హర్భజన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ స్థానంలో సూర్యను సెలెక్ట్ చేసి మంచి పనిచేశారు.. రానున్న ప్రపంచకప్ లో అతడు కీలకమవుతాడు అని స్టార్ స్పోర్ట్స్ తో ఛాటింగ్ సందర్భంగా భజ్జీ అన్నాడు. ‘సూర్య పూర్తిగా పరిణితి చెందిన ఆటగాడు.. అతడి సత్తా త్వరలోనే చూస్తారు.. సంజూ గొప్ప ప్లేయర్ అనడంలో అనుమానం లేదు.. కానీ అతను సెలెక్ట్ కాకపోవడంపై తప్పుగా అర్థం చేసుకోకూడదు.. 15 మందితోనే టీమ్ ను తీసుకోవాలి.. సంజూకు బదులు సూర్యను తీసుకోవడమే రైట్ ఆప్షన్’ అని భజ్జీ అన్నాడు.
వన్డేల్లో ఆటతీరుపై అందరూ క్వశ్చన్ చేయొచ్చు.. కానీ మిడిల్ ఓవర్లలో సూర్య ఆడే గేమ్ సంజూలో ఉంటుందని అనుకోను.. అతడు మొదటినుంచీ భారీ షాట్లకు వెళ్తాడు.. సూర్య మాత్రం పెద్ద స్కోరు చేయగలడు.. టీ20ల్లో ఎలా ఆడుతున్నాడో చూస్తూనే ఉన్నాం.. 5, 6 నంబర్ పొజిషన్ వద్ద బ్యాటింగ్ చేయడం కష్టమైన పని.. ఆ ప్లేస్ లో రోహిత్, విరాటే ఏం చేయలేరు.. యువరాజ్, ధోనికే అది చెల్లింది.. ఇప్పుడా ప్లేస్ లో మళ్లీ ‘స్కై’కే సాధ్యమంటూ అభినందించాడు.