ఆల్ రౌండర్లు(All Rounders) హార్దిక్ పాండ్య, శివమ్ దూబె క్రీజులో కుదురుకోవడంతో భారత్ మెరుగైన స్కోరు చేసింది. ఇంగ్లండ్ తో పుణెలో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత కీలక వికెట్లు కోల్పోయినా తర్వాత పుంజుకుంది. 79 స్కోరుకే 5 వికెట్లు కోల్పోయిన జట్టుకు ఈ మిడిలార్డర్ బ్యాటర్లిద్దరూ అండగా నిలిచారు. పాండ్య మొదట స్లోగా ఆడినా తర్వాత స్పీడ్ పెంచడంతో అతడి హాఫ్ సెంచరీ 27 బంతుల్లో పూర్తయింది. ఈ ఫిఫ్టీలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులున్నాయి. దూబె సైతం 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులో అర్ధ సెంచరీ(Fifty) పూర్తి చేసుకున్నాడు.
అంతకుముందు శాంసన్(1), అభిషేక్(29), తిలక్ వర్మ(0), సూర్యకుమార్(0), రింకూ సింగ్(30) ఔటయ్యారు. ఈ దశలో జత కలిసిన హార్దిక్, శివమ్ చివరి ఓవర్లలో దుమ్ముదులిపారు. 17వ ఓవర్లో సిక్సు, రెండు ఫోర్లతో 17 రన్స్.. 18వ ఓవర్లో ఒక సిక్సు 2 ఫోర్లతో 20 రన్స్ రావడంతో స్కోరు బోర్డులో వేగం పెరిగింది. శివమ్, హార్దిక్ జోడీ 48 బంతుల్లోనే 87 పరుగుల భాగస్వామ్యం ఇచ్చింది. దూబె(53) దూకుడుతో భారత్ స్కోరు 181/9కి చేరగా, ప్రత్యర్థి ఎదుట 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.