భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జరిగిన ఫేర్ వెల్(Farewell) పార్టీలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రోహిత్ వల్లే ఇప్పటిదాకా కోచ్ గా కొనసాగుతున్నా.. లేదంటే గత నవంబరులోనే తప్పుకుందామనుకున్నా అంటూ గత అనుభవాల్ని(Experiences) గుర్తు చేసుకున్నారు. మరో ఎనిమిది నెలల సమయం ఉన్నా ద్రవిడ్ దిగిపోవడానికి ప్రధాన కారణం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం పాలవడమే.
ద్రవిడ్ మాటల్లోనే చూస్తే… ‘గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తీవ్రంగా మధనపడ్డా(Heartbreak).. కోచ్ పదవి నుంచి దిగిపోదామనుకున్నా.. కానీ అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి కాల్ వచ్చింది.. తన దృక్పథాన్ని మార్చాలని(Mind Change), టీ20 వరల్డ్ కప్ దాకా కొనసాగాలని కోరాడు..’ ఆ కాల్ వల్లే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని ద్రవిడ్ గుర్తు చేశాడు.
‘రన్స్ చేశారనో, వికెట్లు తీశారనో, లేకపోతే ఆటగాళ్ల కెరీర్ల గురించి మాట్లాడుకోవడమొక్కటే కాదు.. ఇలాంటి మూమెంట్స్ ను కూడా గుర్తు చేసుకోవాలి.. మీ అందర్నీ చూస్తే గర్వంగా ఉంది..’ అంటూ ద్రవిడ్ మాట్లాడటంతో ప్లేయర్ల రూమ్ కాస్తా గుంభనంగా మారిపోయింది. ఆనాడు జారిపోయిన కప్ ఈ రకంగా దక్కించుకున్నట్లయింది ‘ద వాల్’ ద్రవిడ్ కి.