
Published 19 Dec 2023
ప్రధాన వేలంలోనే కాదు.. మినీ వేలంలోనూ ఐపీఎల్ లో కోట్లు పలుకుతాయని మరోసారి రుజువైంది. కొందరు విదేశీ ఆటగాళ్ల కోసం మేనేజ్మెంట్లు కోట్లు కురిపించాయి. దుబాయ్ లో జరిగిన మినీ వేలంలో ఈసారి అత్యధికంగా వెస్టిండీస్ డైనమిక్ ఆల్ రౌండర్ కు భారీ ధర పలికింది. రోమన్ పావెల్ కు రూ.7.4 కోట్లు వెచ్చిస్తూ రాజస్థాన్ రాయల్స్ అతణ్ని దక్కించుకుంది. ఇక మొన్నటి వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ సైతం రూ.6.8 కోట్లకు అమ్ముడుపోయాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం ట్రావిస్ హెడ్ ను దక్కించుకుంది. ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ ను రూ.4 కోట్లకు ఢిల్లీ కొనుక్కుంది.
భారత్ పరంగా చూస్తే ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ కు రాబోతున్నాడు. అతడికి రూ.4 కోట్లు వెచ్చించి జట్టులో చేర్చుకోనుంది చెన్నై యాజమాన్యం. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను రూ.1.8 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. శ్రీలంక ప్లేయర్ వనిందు హసరంగకు రూ.1.5 కోట్లు వెచ్చించి హైదరాబాద్ సన్ రైజర్స్ కొనుక్కుంది.