ఐపీఎల్-2025 మెగా వేలం ప్రారంభమైంది. స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా వెచ్చించేందుకు పోటీ పడ్డాయి. పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ భారీ మొత్తంలో అమ్ముడయ్యాడు. అతణ్ని పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇతడి కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.