హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఎటుచూసినా పసుపు పచ్చ జెర్సీలే కనపడ్డాయి. అంతలా చైన్నై సూపర్ కింగ్స్(CSK)కు మద్దతు(Support) తెలిపేందుకు వచ్చిన అభిమానుల(Fans)కు పెద్దగా ఆనందం దక్కలేదు. హైదరాబాద్ సన్ రైజర్స్(HSR) బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఓవర్లు ముగిసేసరికి చెన్నై 5 వికెట్లకు 165 రన్స్ చేసింది.
నిలకడగానే ఆడినా…
చెన్నై ఓపెనర్ రచిన్ రవీంద్ర(12) తక్కువ స్కోరుకే ఔటైనా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(26) కొద్ది సేపు నిలబడ్డాడు. ఈ ఇద్దరూ వెనుదిరిగిన తర్వాత అజింక్య రహానే(35; 30 బంతుల్లో 2×4, 1×6), శివమ్ దూబె(45; 24 బంతుల్లో 2×4, 4×6) జోడీ ఆదుకుంది. ముఖ్యంగా దూబె దంచికొట్టగా హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో కమిన్స్ బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో రవీంద్ర జడేజా(31 నాటౌట్; 23 బంతుల్లో 4×4) , డారిల్ మిచెల్(13) జోడీ నిలకడగా ఆడింది.
టాప్ ఆర్డర్ ఔటై…
భారీ స్కోరు చేసే అవకాశమున్నా టాప్ ఆర్డర్ లో ఏ ఒక్కరూ పూర్తిస్థాయిలో నిలబడలేకపోవడంతో చైన్నై భారీ స్కోరు చేయలేకపోయింది. మరోవైపు బ్యాటర్లను అడ్డుకోవడంలో సన్ రైజర్స్ బౌలర్లు సక్సెసయ్యారు.