వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ICC ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో హార్దిక్ పాండ్య నంబర్-1 ఆల్ రౌండర్ గా నిలిచాడు. అతడు రెండు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ప్రపంచకప్ టోర్నీలో 144 రన్స్ చేయడంతోపాటు 11 వికెట్లు తీశాడు. ఫైనల్లో 3 వికెట్లు తీసి భారత్ కప్పు సాధించడానికి కారణమయ్యాడు.
ఇక 4.17 ఎకానమీ(Economy)తో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన బుమ్రా 12 స్థానాలు ఎగబాకి 12వ ప్లేస్ లో నిలిచాడు. అక్షర్ పటేల్ 7వ స్థానంలో.. 10 వికెట్లు తీసిన కుల్దీప్ 3 స్థానాలు పైకి ఎక్కి 8వ ప్లేస్ దక్కించుకున్నాడు.
వరల్డ్ కప్ లోనే అత్యధికం(జాయింట్)గా 17 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్ కెరీర్లోనే అత్యుత్తమంగా 13వ ర్యాంక్ సాధించాడు. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ సెకండ ప్లేస్ లో నిలిస్తే, యశస్వి జైస్వాల్ ఏడో ర్యాంక్ లో ఉన్నాడు.