ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 17 వరకు జరగనున్న ఆసియా కప్ క్రికెట్ కు భారత్-పాక్ రెడీ అయినట్లే. హైబ్రీడ్ మోడల్ లో ఈ మెగా టోర్నీ నిర్వహిస్తుండగా… శ్రీలంక, పాకిస్థాన్ దేశాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. అయితే రెండు దేశాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇండియా-పాక్ మ్యాచ్ పై ఉత్కంఠ ఏర్పడగా… తాజాగా ఆ మ్యాచ్ కు మార్గం సుగమమైంది. ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లబోతోందన్న మాటల్ని కొట్టిపారేసిన IPL ఛైర్మన్ అరుణ్ కుమార్ ధుమాల్… చర్చల కోసం జై షా కూడా పాక్ వెళ్లట్లేదని క్లారిటీగా చెప్పేశాడు. అయితే భారత్ -పాక్ మ్యాచ్ శ్రీలంకలో జరగబోతోందని హింట్ ఇచ్చాడు. అదే నిజమైతే ఈ మ్యాచ్ లంకలోని దంబుల్లా స్టేడియంలో జరిగే అవకాశముంది.
ఫైనల్ కూడా అక్కడే
జైషా సైతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) హెడ్ జాకా అష్రాఫ్ తో మీట్ అయ్యారు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైందని, పాకిస్థాన్ లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్ లు జరుగుతాయని తెలిపారు. ఒకవేళ భారత్-పాక్ ఫైనల్ లో తలపడాల్సి వస్తే అది కూడా శ్రీలంకలోనే ఉంటుందన్న క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నెల 14న ఆసియా కప్-2023 షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశముంది.