అసలైన సమయంలో భారత బౌలర్లు ప్రతాపం చూపించారు. ఆడుతున్నది ఫైనల్(Final) అయినా తడబాటు(Confusion)కు గురి కాలేదు. బాగా ఆడతారనుకున్న ఆస్ట్రేలియా(Australia) బ్యాటర్లను ప్రతి చోటా అడ్డుకుంటూ ఎక్కువ స్కోరు చేయకుండా చూసుకున్నారు. దక్షిణాఫ్రికాలోని బెనోనిలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ తుది పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూల్ని.. మొదటి నుంచి బౌలర్లు కట్టడి(Control) చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా ఈ టోర్నీలో బాగా రాణిస్తున్న భారత పేస్ బౌలర్ రాజ్ లింబాని.. ఈ మ్యాచ్ లోనూ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. అత్యంత తక్కువ రన్స్ ఇస్తూ క్రమంగా వికెట్లు తీసుకున్నాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్లకు 253 పరుగులు చేసింది.
హాఫ్ సెంచరీ సింగ్…
ఆస్ట్రేలియా టీమ్ లో హర్జాస్ సింగ్(55) మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కెప్టెన్ హగ్ వెల్ బిగెన్(48), ఓపెనర్ హారీ డిక్సన్(42) తలో చేయి వేశారు. ముఖ్యంగా ఓపెనింగ్ పేసర్ రాజ్ లింబాని.. అద్భుత బంతులతో ఆస్ట్రేలియన్లు పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. తొలి స్పెల్ లో 5 ఓవర్లు వేసి 12 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసిన ఈ చిన్నోడు.. మొత్తంగా 10 ఓవర్లలో 38 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మరో పేసర్ నమన్ తివారి 2, ముషీర్ ఖాన్, సౌమీ పాండే తలో వికెట్ చొప్పున తీసుకున్నారు.
Published 11 Feb 2024