
భారత్ లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికాపై భారత్-A ఆధిక్యం సాధించింది. రెండో అనధికారిక(Unofficial) టెస్టులో తొలుత భారత్ 255కు ఆలౌటైంది. రెండోరోజు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-A 221కే చాపచుట్టేయడంతో పంత్ సేనకు 34 పరుగుల లీడ్ దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆట ముగిసేసరికి భారత్ 78/3తో ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో పంత్(132) రాణిస్తే.. మన పేసర్లు దక్షిణాఫ్రికా-Aను దెబ్బకొట్టారు. ఆ జట్టులో మార్కస్ అకర్మన్(134) ఒక్కడే నిలబడ్డాడు.
సీనియర్ ప్లేయర్ టెంబా బవుమా(0) డకౌటవగా, రెండో హయ్యెస్ట్ స్కోర్ హెర్మన్(26)దే. ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్, ఆకాశ్ దీప్ రెండేసి చొప్పున వికెట్లు తీశారు. పునరాగమనం చేసిన పంత్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతానికి మన జట్టు పూర్తి ఆధిక్యం 112.