
మిడిలార్డర్ బ్యాటర్లు టిమ్ డేవిడ్(74; 38 బంతుల్లో 8×4, 5×6), స్టాయినిస్ ఫిఫ్టీలతో విరుచుకుపడటంతో ఆస్ట్రేలియా మంచి స్కోరు చేసింది. హెడ్(6), మార్ష్(11), ఇంగ్లిస్(1) తొందరగా ఔటైనా మూడో టీ20లో టిమ్, స్టాయినిస్(64; 39 బంతుల్లో 8×4, 2×6) రెచ్చిపోయారు. ఇక ఆ తర్వాత షార్ట్(26 నాటౌట్) సైతం బ్యాట్ కు పనిచెప్పాడు. దీంతో ఆసీస్ 186/6 చేసింది. అర్షదీప్ 3, వరుణ్ 2, దూబె ఒక వికెట్ తీసుకున్నారు.