
ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 ఈరోజు జరగనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, మరో 2 టీ20లు మిగిలి ఉన్నాయి. నేటి మ్యాచ్ లో గెలిస్తే ఆధిపత్యం సాధించి సిరీస్ సొంతమయ్యే అవకాశముంటుంది. మధ్యాహ్నం 1:45 గంటలకు ఆట ప్రారంభమవుతుంది. అభిషేక్ ఆడుతున్నా గిల్, సూర్య ఇబ్బంది పడుతున్నారు.
తిలక్ వర్మ రాణించాల్సి ఉంది. శాంసన్, అక్షర్, వాషింగ్టన్, జితేశ్ తో టీమ్ పటిష్ఠంగా ఉన్నా ఎందరు ఆడతారోనన్నది సస్పెన్స్ గా మారింది. మొన్న మెరుపు ఇన్నింగ్స్ తో ఆల్ రౌండర్ సుందర్ గెలిపించాడు. అంతోఇంతో ఆల్ రౌండర్లే రాణిస్తున్నారు తప్పితే స్పెషలిస్టులు ఆకట్టుకోవట్లేదు.