ప్రపంచకప్(World Cup)లో భారత ప్రస్థానం ప్రారంభమవుతున్నది. ఈరోజు చెన్నైలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ప్రపంచ కప్ కు కొద్ది రోజుల ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1తో గెలుచుకున్న భారత్ పూర్తి కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది. చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించనున్న దృష్ట్యా టీమ్ఇండియా ముగ్గురు స్పిన్నర్లకు రంగంలోకి దించవచ్చన్న మాటలు వినపడుతున్నాయి.
డెంగీ జ్వరంతో జట్టుకు దూరమైన గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా రానున్నాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ లో రోహిత్, శ్రేయస్ సహా టాప్ ఆర్డరంతా ఇంచుమించు బాగానే ఆడింది. ఈ మ్యాచ్ లోనూ భారత ఆటగాళ్లు ఎలా ఆడతారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంది.