
భారత్-ఆస్ట్రేలియా రెండో టీ20 ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. మెల్ బోర్న్(Melbourne) వేదికగా జరిగే మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తొలి టీ20 వర్షార్పణమైంది. ఈ గ్రౌండ్ లో ఆటను వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 90 వేల మంది వస్తారని అంచనా. భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పైనే ఆశలున్నాయి.