ఇప్పటికే ఫైనల్ చేరుకున్న భారత జట్టుతో టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్ పోటీ పడబోతున్నాయి. ఈ నామమాత్ర మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసియాకప్ సూపర్-4లో ఇది చివరి మ్యాచ్ కాగా.. భారత్ జట్టు పూర్తి పటిష్ఠంగా కనిపిస్తున్నది. టాప్, మిడిలార్డర్ బ్యాటర్లంతా రాణిస్తుండటంతో బంగ్లాదేశ్ ఏ మేరకు పోరాటం కనబరుస్తుందో చూడాలి.
ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో టీమ్ఇండియా అందరికన్నా ముందుగా ఫైనల్ చేరుకోగా.. పాకిస్థాన్ ను ఓడించిన లంక భారత్ తో పోటీకి సై అంటోంది.