భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 52 ఏళ్లుగా ఆస్ట్రేలియాపై విజయమే ఎరుగని భారత్.. ఇప్పుడా రికార్డును తిరగరాసింది. ఆస్ట్రేలియాపై 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. 1972లో జరిగిన గేమ్స్ లో ఆనాడు 3-1 తేడాతో ఆసీస్ ఓడిపోయింది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్(13వ, 32వ) నిమిషాల్లో గోల్స్ సాధించగా.. 12వ నిమిషంలో అభిషేక్ మరో గోల్ చేశాడు. ప్రత్యర్థి టీమ్ లో టామ్ క్రెయిగ్(25వ), బ్లేక్ గ్రోవర్స్(55వ) నిమిషంలో గోల్స్ సాధించారు.