రోహిత్, కోహ్లి లేని టీమ్ ఎలా ఉంటుందోనన్న అనుమానాల్ని తీరుస్తూ టీమ్ఇండియా ప్లేయర్లు అదరగొట్టారు. ఇంగ్లండ్(England)ను రెండో టెస్టులో వారి సొంతగడ్డపైనే ఓడించారు. 607 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. 271కి ఆలౌటవడంతో 336 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. జేమీ స్మిత్(88) అడ్డుపడాలనుకున్నా ఆటలు సాగనివ్వలేదు ఆకాశ్ దీప్. అతడు 6 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587, రెండో ఇన్నింగ్స్ లో 427/6d చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 407 చేసి 180 పరుగుల ఆధిక్యాన్ని అప్పగించింది. తొలి టెస్టులో ఇంగ్లండ్.. రెండో టెస్టులో భారత్ గెలిచి 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-1తో సమంగా ఉన్నాయి. కెప్టెన్ గిల్ తొలుత 269, తర్వాత 161తో ఈ టెస్టులో మొత్తంగా 430 పరుగులు చేసి ముందుండి నడిపించాడు. https://justpostnews.com