కోట్లాది అభిమానుల ఆశల్ని నిలబెట్టేలా ఫైనల్ ను ఘనంగా ఆరంభించింది టీమ్ఇండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్(New Zealand)ను మొదట్నుంచీ అదుపులోనే ఉంచింది. డేంజరస్ బ్యాటర్లు రచిన్(37), విలియమ్సన్(11)ను కుల్దీప్ దెబ్బతీశాడు. ఈ ఇద్దర్నీ త్వరగా ఔట్ చేయడంతో ఆ జట్టు స్పీడ్ లేకుండా పోయింది. యంగ్(15), ఫిలిప్స్(34)ను వరుణ్.. కుదురుకున్న మిచెల్(63)ను షమి ఔట్ చేశాడు. 200 స్కోరు దాటడానికి 44.4 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. చివరకు న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేయగా, బ్రేస్ వెల్(53) నాటౌట్ గా నిలిచాడు.