హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(92; 41 బంతుల్లో 7×4, 8×6 ) ఫటాఫట్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా(Australia) స్టార్ బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి. మనకు పెద్దగా నష్టం లేకున్నా తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో కంగారూలకు విధ్వంసం ఎలా ఉంటుందో చూపించాడు. ఓవర్ కు 11కు పైగా రన్ రేట్(Run Rate) సాగించాడంటే అతడి ఏకఛత్రాధిపత్యం(One Man Show) ఎలా నడిచిందో అర్థమవుతుంది. కొద్దిలో సెంచరీ తప్పిందే కానీ లేకపోతేనా…
స్టార్క్ కు చుక్కలే…
స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 6, 6, 4, 6, 1wd, 6తో మొత్తం 29 పరుగులు పిండుకున్నాడు రోహిత్. భారత్ స్కోరు 4.5 ఓవర్లలో 50 చేరుకుంటే.. అతడు కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ ఎందుకిచ్చామా అని అనుకున్నారేమో ఆస్ట్రేలియన్లు.
అసలే వర్షం…
వర్షం ముప్పుందని భావిస్తే అనుకున్నట్లే వరుణుడు పలకరించాడు. దీంతో కొద్దిసేపు మాత్రమే ఆట నిలిచిపోయింది. ఇలాంటి వాతావరణం ఉంటుందేమోనన్న ఉద్దేశమే కావచ్చు.. రోహిత్ రెచ్చిపోవడానికి. కోహ్లి(0)కే వెనుదిరిగినా, పంత్(15) తొందరగా ఔటైనా ఆ ప్రభావం ఎక్కడా కనపడకుండా చేశాడీ సారథి(Captain).
వరల్డ్ రికార్డ్…
పొట్టి ఫార్మాట్లో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడీ ఓపెనర్. 200 సిక్స్ లు దాటిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. అతడి తర్వాత న్యూజిలాండర్ మార్టిన గప్తిల్(173), ఇంగ్లడ్ ఆటగాడు జోస్ బట్లర్(137) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.