డిఫెండింగ్(Defending) ఛాంపియన్ భారత్.. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్ చేరింది. చైనాలోని హులున్ బుయర్లో జరిగిన సెమీస్ లో దక్షిణకొరియా(South Korea)ను 4-1 తేడాతో ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో ఆతిథ్య చైనాతో భారత్ తలపడుతుంది. మన ఆటగాళ్ల ధాటికి సౌత్ కొరియా వద్ద సమాధానమే లేకుండా పోయింది.
ఉత్తమ్ సింగ్(13వ నిమిషంలో), హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్(19వ, 45వ నిమిషాల్లో), జర్మన్ ప్రీత్ సింగ్(32వ నిమిషంలో) గోల్స్ చేశారు. పాకిస్థాన్ షూటౌట్లో 2-0తో గెలిచిన చైనా ఇప్పటికే తుది పోరుకు చేరుకుంది.