45వ ఫిడే చెస్ ఒలింపియాడ్ ఓపెన్ కేటగిరీలో భారత్ చరిత్ర సృష్టించింది. హంగరీ రాజధాని బుడాపెస్ట్ లో జరిగిన క్రీడల్లో స్లోవేనియాపై గెలుపొంది స్వర్ణం(Gold) సాధించింది. 97 సంవత్సరాల టోర్నీ చరిత్రలో బంగారు పతకం సాధించడం భారత్ కు ఇదే తొలిసారి. పురుషులు(Men’s), మహిళల టీంలు తొలిసారి స్వర్ణాలను అందుకున్నాయి. చివరి రౌండ్లో వ్లాదిమిర్ ఫెదోసీవ్ ను గుకేశ్, జాన్ సుబెల్జ్ పై ఇరిగేశి, అంటన్ డెంచెకోపై ప్రజ్జానంద విజయం సాధించారు.
ఉమెన్ టీమ్ కూడా అజర్ బైజాన్ పై గెలుపొంది బంగారు పతకాన్ని ముద్దాడింది. డి.హారిక, దివ్య దేశ్ ముఖ్ లు తమ గేముల్లో విజయం సాధిస్తే ఆర్.వైశాలి డ్రాగా ముగించింది. అటు వంతిక అగర్వాల్ ప్రత్యర్థిపై పైచేయి సాధించడంతో స్వర్ణం సాకారమైంది.